చార్ సౌ అనేది సీట్ల గురించి కాదు పెట్రోల్ రేట్ల గురించి!.. బీజేపీపై కేటీఆర్ సెటైర్

by Ramesh Goud |   ( Updated:2024-05-05 14:38:58.0  )
చార్ సౌ అనేది సీట్ల గురించి కాదు పెట్రోల్ రేట్ల గురించి!.. బీజేపీపై కేటీఆర్ సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెట్రోల్ ధరల గురించి ప్రస్తావిస్తూ.. బీజేపీ పై విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ చెప్పే చార్ సౌ సీట్ల గురించి కాదని పెట్రోల్ రేట్ర గురించి అని.. బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేస్తే పెట్రోల్ ధరలు 400 దాటుతాయని ట్వీట్ చేశారు. దీనిపై కొందరు వ్యంగ్యంగా చేసిన వీడియోను వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి బయటకి వెళ్లే సమయంలో పెట్రోల్ లేదని గుర్తించి పెట్రోల్ కొట్టించడానికి బైక్ తీసుకొని దగ్గరలోని పెట్రోల్ పంప్ దగ్గరకి వెళ్తాడు. లీటర్ పెట్రోల్ ఎంతని అడగగా.. బంకు సిబ్బంది రూ.400 అని సమాధానం ఇస్తాడు.

దీంతో అవాక్కైన ఆ వ్యక్తి బెడ్ పై నుంచి లేచి తాను కల కన్నట్లు తెలుసుకుంటాడు. అబ్ కా బార్.. చార్ సౌ పార్ అంటే ఎంటో అనుకున్న లీటర్ పెట్రోల్ 400 లా అని ఆశ్యర్యపోతాడు. దీనిపై కేటీఆర్.. కాషాయ పార్టీ పెట్రోల్ ధరలతో ఇప్పటికే సామాన్యుడి నడ్డి విరుస్తోందని అన్నారు. అబ్ కా బార్.. చార్ సౌ పార్ అని నమ్మి ఓటెస్తే ఇగ ఆగమేనని, చార్ సౌ అనేది సీట్ల గురించి కాదు పెట్రోల్ రేట్ర గురించి అని అన్నారు. అంతేగాక 2014 లో రూ.70, 2024 లో రూ.110, 2029 లో రూ.400? అని ఆయా సంవత్సరాలలో పెట్రోల్ ధరల గురించి ఎక్స్ వేదికగా ప్రస్తావించారు.

Read More...

BREAKING: ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై పోలీసుల ముమ్మర తనిఖీలు.. రూ.58.86 లక్షల నగదు స్వాధీనం

Advertisement

Next Story

Most Viewed