ఆందోళనకరంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి: కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-10-14 11:45:37.0  )
ఆందోళనకరంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి: కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో కాసాని ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జైల్లో ఉన్న చంద్రబాబు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ఆయన సరిగ్గా మాట్లాడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో నిత్యం ప్రజల కోసం పని చేసిన చంద్రబాబును జైల్లో చూడగానే బాధ కలిగిందన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని అన్నారు.

త్వరలోనే ఆయన జైలు నుండి బయటకు వస్తారని దీమా వ్యక్తం చేశారు. కాగా, చంద్రబాబు కుటుంబ సభ్యులు లోకేష్, భువనేశ్వరితో కాసాని పార్టీ అధినేతతో ములాఖత్ అయ్యారు. మరికొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, ప్రకటన, ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యుహాల గురించి చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తామని టీడీపీ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed