- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగస్టు 5th నుంచి జేఎల్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1392 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష నిర్వహించింది. ఇటీవల ఫలితాలను రిలీజ్ చేసింది. 27 సబ్జెక్టుల్లో మొత్తం 2724 మందిని కమిషన్ పికప్ చేసింది. కాగా ఈ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను ఆగస్టు 5 నుంచి ప్రారంభించనుంది. సెప్టెంబర్ 11 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. సాధారణ అభ్యర్థులను 1:2 రేషియోలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులను 1:5 రేషియోలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రావాల్సిందిగా సూచించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా వచ్చేనెల 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఇతర వివరాలకు అభ్యర్థులు http://www.tspsc.gov.in వెబ్ సైట్ సందర్శించాలని అధికారులు సూచించారు.