సైబరాబాద్ ​కమిషనరేట్​ పరిధిలో త్వరలో సెంట్రలైజ్డ్​ క్లూస్​ టీం: CP ​స్టీఫెన్​రవీంద్ర

by Satheesh |
సైబరాబాద్ ​కమిషనరేట్​ పరిధిలో త్వరలో సెంట్రలైజ్డ్​ క్లూస్​ టీం: CP ​స్టీఫెన్​రవీంద్ర
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సైబరాబాద్ ​కమిషనరేట్​ పరిధిలో త్వరలోనే సెంట్రలైజ్డ్ ​క్లూస్​ టీం కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర తెలిపారు. నేర ప్రదేశాల నుంచి ఆధారాల సేకరణలో నాణ్యతను మరింత మెరుగుపరచటం కోసం క్లూస్, వేలిముద్రల యూనిట్లను ఇప్పటికే పటిష్టం చేసినట్టు చెప్పారు. కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర శుక్రవారం, డీసీపీ క్రైమ్స్ ​కల్మేశ్వర్​ సింగెన్వర్, ఎఫ్ఎస్ఎల్​ అసిస్టెంట్ ​డైరెక్టర్, హైదరాబాద్ ​క్లూస్​ టీం హెచ్వోడీ వెంకన్నతో కలిసి తన కార్యాలయంలో ఫింగర్​ప్రింట్​ యూనిట్స్, క్లూస్​టీం సిబ్బందితో సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఇప్పటివరకు మాదాపూర్, శంషాబాద్, బాలానగర్​ జోన్లలో ఫింగర్​ప్రింట్, క్లూస్​టీంలు పని చేస్తున్నట్టు చెప్పారు. వీటికి అదనంగా కొత్తగా ఏర్పాటైన రాజేంద్రనగర్, మేడ్చల్​ జోన్లలో కూడా ఈ టీములను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

నేరం జరిగినపుడు దోషులకు శిక్షలు పడేలా చూడటంలో సాక్ష్యాలు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ క్రమంలో వీలైనంత వేగంగా నేర స్థలానికి చేరుకుని కీలకమైన ఆధారాలను సేకరించాలని సూచించారు. హైదరాబాద్​క్లూస్​టీం హెడ్​వెంకన్న వర్క్​మానిటరింగ్, క్వాలిటీ ఎన్సూరింగ్, అకౌంటబిలిటీ తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. నేర స్థలం నుంచి ఆధారాలను సేకరించటంలో నూతన సాంకేతిక పద్దతులను అవలంభించాలని చెప్పారు. ఫలితంగా సంక్లిష్టమైన కేసుల్లో సైతం మిస్టరీని తొందరగా ఛేదింవచ్చన్నారు. తద్వారా కేసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా కేసుల ఛేధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి కమిషనర్​స్టీఫెన్​రవీంద్ర రివార్డులు అందచేశారు. సమావేశంలో అన్ని డివిజన్ల ఏసీపీలు, ఫింగర్​ప్రింట్, క్లూస్​టీం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed