- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS News: తెలంగాణ సర్కారుకు కేంద్రం నోటీసులు
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఉపాధి హామి పథకంలో అవకతవకలు జరిగాయని కేంద్రం నిర్థారించినట్లు తెలిపింది. ఉపాధి హామీ పథకం నిధులు దారి మళ్లించారని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులను పంపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఇజీఎస్) నిధులను కేంద్ర పథకం మార్గదర్శకాల ప్రకారం అనుమతించని పథకాలకు మళ్లించినందుకు రూ. 151.9 కోట్లు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు పంపించింది. తిరిగి చెల్లించేందుకు కేసీఆర్ సర్కార్ గ్రామీణాభివృద్ధి శాఖకు నవంబర్ 30(రెండు రోజులు) వరకు కేంద్రం గడువు ఇచ్చింది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లించకపోతే.. తదుపరి వాయిదాలను నిలిపివేయనున్నట్టుగా తెలిపింది. కాగా, ఇప్పటికే కేసీఆర్ సర్కార్‌కు, మోడీ సర్కార్‌కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం జారీ చేసిన నోటీసులు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం మధ్య మరోసారి మాటల యుద్ధం తెరదీసే అవకాశం ఉంది.