- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుప్రీంకోర్టును ఆశ్రయించిన 14 విపక్ష పార్టీలు
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రతిపక్షాలే టార్గెట్ గా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని ఆరోపిస్తూ 14 ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అరెస్టుకు ముందు, తర్వాత మర్గదర్శకాలు ఇవ్వాలని పార్టీలు పిటిషన్ లో కోరాయి. ఈడీకి అపరిమిత అధికారాలు ఉన్నాయని దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ అభిషేక్ మను సింఘ్వీ బెంచ్ ఏప్రిల్ 5న విచారణ చేపట్టనుంది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన పార్టీల్లో కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, జార్ఖండ్ లిబరేషన్ ఫ్రంట్, జనతాదళ్ యునైటెడ్, భారత రాష్ట్ర సమితి, రాష్ట్రీయ జనతా దళ్, సమాజ్ వాదీ పార్టీ, శివసేన (ఉద్ధవ్), నేషనల్ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, డీఎంకే లు ఉన్నాయి. బీజేపీలో చేరిన వారిపై కేసులు ఎత్తివేస్తూ.. వ్యతిరేకిస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని గత కొంత కాలంగా విపక్షాలు కేంద్రంపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. కాగా విపక్షాల ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఏజెన్సీలు స్వతంత్రంగా పని చేస్తాయని కౌంటర్ ఇచ్చింది.