- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్
దిశ, డైనమిక్ బ్యూరో : నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సీఆర్పీఎఫ్ నుంచి గురువారం భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1.30లక్షల కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను హోంమంత్రిత్వ శాఖ భర్తీ చేయనుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో లెవల్ 3 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారం 1,29,929 పోస్టులకు రిక్రూట్మెంట్ జరగనుంది.
వీటిలో 1.25 పోస్టులు పురుషులకు.. 4,467 పోస్టులు మహిళలకు కేటాయించగా.. ఎక్స్-అగ్నివీర్లకు 10 శాతం ఖాళీలు కేటాయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 10వ మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల అదనపు వయోపరిమితి ఉంది. త్వరలో దరఖాస్తుల స్వీకరణ తేదీలు ప్రకటించనున్నారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక సీఆర్‌పీఎఫ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.