- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కృష్ణా జలాల వివాదంపై కేంద్రం నిర్ణయం.. కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణ కృష్ణా జలాల వాటాలు తేల్చాలని ట్రైబ్యునల్‌కు ఈ రోజు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం, తెలంగాణ మధ్య చర్చలు జరిగాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతోనే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. జల వివాదాలు పరిష్కరించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. 2021లో రిట్ పిటిషన్‌ను తెలంగాణ ఉపసంహరించుకుందన్నారు.
సమస్య పరిష్కరించాలని రెండు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయన్నారు. ఈ అంశంపై రెండు రాష్ట్రాలతో కేంద్రం అనేక సార్లు మాట్లాడిందన్నారు. సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కూడా కేంద్రం తీసుకుందన్నారు. సొలిసిటర్ జనరల్ 2023 జులైలో న్యాయశాఖకు నివేదిక ఇచ్చారన్నారు. ట్రైబ్యునల్ అదనపు నిబంధనలు చేర్చాలని నిర్ణయించారన్నారు. సెక్షన్ 12కు అదనపు నిబంధనలు చేర్చి సమస్య పరిష్కరించుకోవచ్చని సూచించారన్నారు. సెక్షన్ 12కు అదనపు నిబంధనలు చేర్చి సమస్య పరిష్కరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్రం నిర్ణయంతో సమస్య పరిష్కారం అవుతుందని ఆకాంక్షిస్తున్నానని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తోందన్నారు. కేంద్ర విద్యాశాఖ ద్వారా రూ.889 కోట్లతో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.