సేమ్ సెక్స్ మ్యారేజ్‌లపై రాష్ట్రాల అభిప్రాయం కోరిన కేంద్రం

by Sathputhe Rajesh |
సేమ్ సెక్స్ మ్యారేజ్‌లపై రాష్ట్రాల అభిప్రాయం కోరిన కేంద్రం
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్వలింగ వివాహాల విషయంలో ప్రస్తుతం జరుగుతున్న విచారణలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను భాగస్వాములను చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. ఈ మేరకు బుధవారం కేంద్రం సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అంశంపై పది రోజుల్లో అభిప్రాయం చెప్పాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ఈ అంశం శాసన పరిధిలోకి వస్తుందని, అందుకే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయాలు అవసరం అని లేఖలో కేంద్రం పేర్కొంది.

స్వలింగ వివాహాల విషయంలో ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు వివిధ ప్రాంతాల్లోని వర్గాల్లో ఉన్న ఆచార వ్యవహారాలు, పద్ధతులు నిబంధనలు గమనించాల్సి ఉందని అందువల్ల రాష్ట్రాలు అభిప్రాయాలు చెప్పాలని కోరింది. సేమ్ సెక్స్ మ్యారేజ్ లను చట్టబద్ధం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో బుధవారం కూడా వాదనలు జరిగాయి. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదురుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరుపుతోంది. అయితే పిటిషన్ల విచారణార్హతపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా ఈ కేసులో అనుకూల, ప్రతికూల వాదనలు తొలుత వింటామని ధర్మాసం స్పష్టం ఇప్పటికే స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed