- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఈసీ కీలక భేటీ.. నేడే కాంగ్రెస్ సెకండ్ లిస్టుపై క్లారిటీ!
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ ఎంపిక నేటితో పూర్తి కానున్నది. ఇటీవల స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించిన జాబితాను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఫైనల్ చేయనున్నది. ఈ మేరకు శనివారం ఢిల్లీలో సీఈసీ మీటింగ్ నిర్వహించనున్నది. ఫస్ట్ లిస్టులో 55 మంది అభ్యర్థులను ప్రకటించగా, మిగిలిన 64 సెగ్మెంట్‌లకు ఈరోజు క్యాండిడేట్లను ఖరారు చేసే అవకాశం ఉంది. దాదాపు సెకండ్ లిస్టులోనే అన్ని సెగ్మెంట్‌లు ప్రకటించాలని పార్టీ ఆలోచిస్తున్నది. కానీ సీఈసీ మీటింగ్ తర్వాత కూడా తేలని సెగ్మెంట్‌లు ఉంటే.. ఆయా అభ్యర్ధుల జాబితాను హోల్డ్‌లోనే ఉంచి, థర్డ్ లిస్టులో రిలీజ్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
కీలక నేతల పేర్లన్నీ అందులోనే..
కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ కోసం ఆ పార్టీ నేతలతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కీలక నేతల పేర్లన్నీ రెండో లిస్టులోనే ఉండే చాన్స్ ఉన్నదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చాలా మంది సీనియర్ల పేర్లు ఈ జాబితాలో కనిపించనున్నాయి. దీంతో పార్టీ లీడర్లతో పాటు కేడర్ కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నది. వాస్తవానికి ఫస్ట్ లిస్టు విడుదల తర్వాత అసంతృప్తి రాగాలు చాలా తక్కువగా వినిపించాయి. కానీ సెకండ్ లిస్టు తర్వాత మాత్రం ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ లిస్టులోని సెగ్మెంట్‌లకు దాదాపు ఇద్దరు బలమైన నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో టిక్కెట్ల ప్రకటన తర్వాత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
పొత్తు, సీట్లు ప్రకటిస్తారా ?
కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు కూడా ఖరారు అయింది కాబట్టి, నేడు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే సెకండ్ లిస్టులో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఇచ్చిన సీట్లను ప్రకటిస్తారా? లేదా? అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉన్నది. ఇక పొత్తులు ఫైనల్ అయినట్లు ఆయా సెగ్మెంట్‌ల నుంచి కాంగ్రెస్ నుంచి టిక్కెట్ ఆశించిన నేతలకు పార్టీ ముందే సమాచారం ఇచ్చింది.
జానారెడ్డి టీమ్ అలర్ట్ ..
అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు జానారెడ్డి టీమ్ శనివారం నుంచే రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. కమ్యూనిస్టులకు వదిలేసిన సీట్లలోని కాంగ్రెస్ పార్టీ నేతలు, ఒక్కో నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న ఇద్దరు ప్రధాన ఆశావహులతో భేటీ కానున్నట్లు తెలిసింది. శనివారం ఉదయమే ఈ టీమ్‌కు టిక్కెట్ రాని నేతల వివరాలు అందే అవకాశం ఉన్నట్లు ఏఐసీసీకి చెందిన ఓ నేత తెలిపారు.