- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నలుగురు BRS ఎమ్మెల్యేలకు CBI టెన్షన్.. సీఎం కేసీఆర్ కాపాడుతారా...?
దిశ, తెలంగాణ బ్యూరో : 'ఎర' కేసు ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. కేసు దర్యాప్తులో భాగంగా రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను హైకోర్టు కొట్టివేసి సీబీఐకి అప్పగిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో ఈ కేసు ఎటుదారితీస్తుందోనని ఆందోళన స్టార్ట్ అయింది. అధికారులు ఎర కేసులో ఉన్న నలుగురి ఎమ్మెల్యేలను వేర్వురుగా ప్రశ్నిస్తే ఏమైనా నోరు జారుతుందా? అని మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తే ఇదే తీర్పు వస్తే ఏం చేయాలనేదానిపై సైతం తర్జనభర్జన పడుతున్నారు. ఎమ్మెల్యేలు దర్యాప్తు సమయంలో ఎలాంటి సమాధానం చెప్పాలనే దానిపై కేసీఆర్ ఆ నలుగురి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫాం హౌజ్ ఘటన అక్టోబర్ 26న జరిగింది. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ఢీల్ జరుగుతుందనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి రాంచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను అరెస్టు చేశారు. ఈ ఘటనలో రోహిత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. ఈ సిట్ సరిగ్గా విచారణ చేయడం లేదని సీబీఐకి అప్పగించాలని నిందితులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏకీభవించిన హైకోర్టు ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకీ అప్పగించాలని తీర్పు ఇచ్చింది. అంతేకాదు సిట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ధీమాగా ఉన్న ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. ఈ కేసు ఎటుదారి తీస్తుందో తెలియక సతమతమవుతున్నారు. ఎర కేసు జరిగిన రోజే ఎమ్మెల్యేలంతా నేరుగా ప్రగతిభవన్‌కు రావడం పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు ఆ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. వారి ఫోన్లపై సైతం ప్రగతిభవన్ నిఘా పెట్టింది. ఈ తరుణంలోనే ఈ కేసులో కీలకంగా ఉన్న రోహిత్ రెడ్డిని రెండుదఫాలుగా ఈడీ అధికారులు విచారించారు. మూడోసారి విచారిస్తున్నారు. ఈడీకి సంబంధం లేని కేసులో నోటీసులు ఇచ్చి విచారణ చేయడంపై హైకోర్టులో రిట్ వేశారు. అయితే ఇప్పటివరకు కేసీఆర్ ఉన్నాడనే ధీమాతో ఉన్న ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది.
వేర్వేరుగా ప్రశ్నిస్తే...
ఎర కేసు రెండు నెలలుగా ఉత్కంఠను రేపుతోంది. కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను సీబీఐ అధికారులు వేర్వేరుగా ప్రశ్నిస్తే ఒకరికి తెలియకుండా ఒకరం వేర్వేరుగా చెబితే మొదటికి మోసం వస్తుందనే ఆందోళన మొదలైంది. వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయంపై ఈ నలుగురి ఎమ్మెల్యేలతో త్వరలోనే కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్లినా హైకోర్టు తీర్పునే సమర్ధిస్తే ఏం చేయాలనేదానిపై చర్చించే అవకాశం ఉన్నది. న్యాయనిపుణుల సలహాలు సైతం తీసుకునే అవకాశం ఉంది. వారి సలహాలు, సూచనలతోనే ముందుకు వెళ్తామని ఇప్పటికే రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసు రోజున కారులో కనిపించిన బ్యాగుల్లో డబ్బు ఉందనే ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటివరకు అది మిస్టరీగానే ఉంది.