బ్రేకింగ్: MLA అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు

by Satheesh |   ( Updated:2023-11-22 10:29:32.0  )
బ్రేకింగ్: MLA అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: విధుల్లో ఉన్న ఇన్ స్పెక్టర్‌ను బెదిరించాడన్న ఆరోపణలపై ఎంఐఎం ఎమ్మెల్యే, ఆ పార్టీ చంద్రయాన్ గుట్ట అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు అయింది. ఐపీసీ 353 సహా వివిధ సెక్షన్ల కింద సంతోష్ నగర్ పోలీసులు ఇవాళ కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి చాంద్రాయణగుట్ట నియోజకవర్గం సంతోష్ నగర్ పీఎస్ పరిధిలో అక్బరుద్దీన్ ఓవైసీ ప్రచారం నిర్వహిస్తుండగా స్థానిక ఇన్ స్పెక్టర్ పి.శివచంద్ర సమయం ముగిసిందని ఇక ప్రచారాన్ని ముగించాలని సూచించారు. దీంతో సదరు అధికారిపై ఓవైసీ చిందులు తొక్కారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story