Langar Houz: లంగర్ హౌస్ లో కారు బీభత్సం.. దంపతులు మృతి

by Rani Yarlagadda |
Langar Houz: లంగర్ హౌస్ లో కారు బీభత్సం.. దంపతులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: లంగర్ హౌస్ (Langar Houz)లో ఓ కారు బీభత్సం (Car Accident)సృష్టించింది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు.. వాహనాలపైకి దూసుకెళ్లింది. బైక్ పై వెళ్తున్న దంపతుల్ని ఢీ కొట్టడంతో.. వారు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కావడంతో.. వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మద్యం మత్తులో కారును అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు నిర్థారించారు. మృతులు లంగర్ హౌస్ కు చెందిన మీనా ఠాకూర్, దినేష్ లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో 3 టూ వీలర్లు, ఒక ఆటో ధ్వంసమయ్యాయి. కారునడిపిన నిందితుడు ప్రణయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed