- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS Sharmila: మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్, బీజేపీ కుట్ర.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ (Sangh Pariwar), బీజేపీ (BJP) కుట్రలు చేస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలు బీజేపీ (BJP) అహంకారానికి నిదర్శనమని ట్వీట్ చేశారు. ఇది భారత రాజ్యాంగానికి జరగిన ఘోర అవమానం అంటూ ఫైర్ అయ్యారు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీల మనోభావాలను కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షా దెబ్బతీశారంటూ ధ్వజమెత్తారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్, బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మనుస్మృతిని బీజేపీ (BJP) విశ్వసిస్తుంది కాబట్టే అనుక్షణం రాజ్యాంగంపై దాడికి పాల్పడుతోందని అన్నారు. పార్లమెంట్ (Parliament), బహిరంగ సభల్లో రాజ్యాంగ నిర్మాతను హేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ (Ambedkar)ను అవమానించిన అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా AICC పిలుపు మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని షర్మిల పిలుపునిచ్చారు.