- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్రేకింగ్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు డేట్ ఫిక్స్
దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల తేదీని ప్రకటిస్తూ రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 57 కంటోన్మెంట్ బోర్డులకు ఎన్నికల తేదీలను రక్షణ శాఖ శనివారం ఖరారు చేసింది. ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. రెండేళ్ల క్రితమే కంటోన్మెంట్ పాలక మండలి పదవీ కాలం ముగిసింది. ఏడాదిగా నామినేటెడ్ సభ్యుల ద్వారా పాలన సాగిస్తున్నారు. కాగా సికింద్రబాద్ కంటోన్మెంట్‌లో 8 వార్డులు ఉన్నాయి.
కాగా ఓ పక్క కంటోన్మెంట్‌లను సమీపంలోని మున్సిపాలిటీల్లో కలిపే ప్రక్రయకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం సైతం సమ్మతిని తెలుపుతూ గతంలో సమాధానం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కంటోన్మెంట్‌ను స్థానిక సంస్థల్లో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ సైతం గతంలో విజ్ఞప్తులు చేశారు. ఈ క్రమంలో అనూహ్యంగా కంటోన్మెంట్ ఎన్నికలకు రక్షణ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడంతో మున్సిపాలిటీల్లో కంటోన్మెంట్ విలీన ప్రక్రియపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి.