- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు, మూడ్రోజుల్లో కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ప్రకటన: ఈటల రాజేందర్
దిశ, తెలంగాణ బ్యూరో: రెండు మూడు రోజుల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటిస్తామని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కు ఉత్తరాదిలో గెలిచే పరిస్థితి ఉంటే రాహూల్ గాంధీ అక్కడ వదిలిపెట్టి దక్షిణాది నుంచి ఎందుకుపోటీ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నార్త్‌లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోయిందని ఈటల విమర్శలు చేశారు. సౌత్‌లో కాంగ్రెస్.. బీజేపీపై అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ కల్చర్‌ను రేవంత్ కొనసాగిస్తున్నారని ఈటల విరుచుకుపడ్డారు.
ఇతర పార్టీల నాయకులను ప్రలోభపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ఫైరయ్యారు. నేతలపై ప్రెజర్ పెట్టి కాంగ్రెస్‌లోకి చేర్చుకుంటున్నారని రాజేందర్ విమర్శించారు. కేసీఆర్‌లా ఫక్తు రాజకీయాల గురించి ఆలోచిస్తూ.. రేవంత్ రెడ్డి ప్రజలను గాలికి వదిలేస్తున్నారని ఈటల పేర్కొన్నారు. ప్రధాని మోడీ హవా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. నాయకులను చేర్చుకున్నంత మాత్రాన కేడర్‌ను దెబ్బతీయలేరని, కొంత మంది లీడర్లు వెళ్లినంత మాత్రాన తమకు ఎటువంటి ఫరక్ లేదన్నారు. రేవంత్ గత గుణపాఠాలు చూసుకుని నడవాలని ఈటల సూచించారు.