- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విదేశీయులకు కెనడా గుడ్ న్యూస్.. టూరిస్ట్ వీసా ఉంటే ఇక ఆ ఛాన్స్
దిశ, వెబ్‌డెస్క్: విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తర్వాత గమ్య స్థానంగా కెనడా ఉంది. అయితే కెనడా ప్రభుత్వం కోవిడ్ అనంతరం తమ దేశంలో పనిచేయాలనుకునే విదేశీయులకు కొంత వెసులుబాటు కల్పించింది. విదేశీయులకు కెనడా ప్రభుత్వం గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది. టూరిస్ట్ వీసాపై తమ దేశానికి వచ్చే విదేశీయులు చెల్లు బాటు అయ్యే జాబ్ ఆఫర్‌ను పొందినట్లయితే దేశం విడిచి వెళ్లకుండానే వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్ షిప్ కెనడా(ఐఆర్ సీసీ) తాజాగా కీలక ప్రకటన చేసింది.
ఈ మేరకు 2025 ఫిబ్రవరి 28 వరకు రెండేళ్లపాటు కోవిడ్ ఎరా టెంపరరీ పాలసీని పొడిగించింది. అయితే ఇంతకు ముందు కెనడాలో పనిచేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. అక్కడికి వెళ్లడానికి ముందే పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. అయితే వర్క్ పర్మిట్ దరఖాస్తు అప్రూవల్ చేయబడి, అప్పటికే టూరిస్ట్ వీసాపై కెనడాలో ఉన్నట్లయితే అలాంటి వారికి వర్క్ పర్మిట్ రావాలంటే దేశం విడిచి వెళ్లాల్సి వచ్చేది.
అయితే తాజాగా కోవిడ్ ఎరా టెంపరరీ పబ్లిక్ పాలసీ ప్రకారం టూరిస్ట్ లు దేశాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ పాలసీ నుంచి బెనిఫిట్ పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకున్న రోజున టూరిస్ట్‌గా కెనడాలో చెల్లుబాటయ్యే స్టేటస్‌ను కలిగి ఉంటే చాలు. లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ ఆఫర్ లెటర్ పొంది ఉండాల్సి ఉంటుంది.
లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ అనేది ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ డెవలప్ మెంట్ కెనడా లోని ఒక భాగం. విదేశీ ఉద్యోగుల నియామకం ద్వారా కెనడాపై చూపే ప్రభావాన్ని ఈ విభాగం అంచనా వేస్తూ వస్తోంది. ఇక ఈ పాలసీ ప్రకారం దరఖాస్తు దారులు తప్పనిసరిగా ఎంప్లాయర్ స్పెసిఫిక్ వర్క్ పర్మిట్ కోసం 2025 ఫిబ్రవరి 28 తర్వాత దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.