- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Israel Strikes: లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి.. 52 మంది మృతి
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. లెబనాన్(Lebanon) లోని హెజ్ బొల్లా(Hezbollah) మిలిటెంట్లు లక్ష్యంగా ఇజ్రాయెల్(Israeli military) జరిపిన దాడుల్లో 52 మంది చనిపోయారు. తూర్పు లెబనాన్‌లోని బెకా వ్యాలీలో బాల్‌బెక్ జిల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్(Israel- Hezbollah ) దాడులకు పాల్పడింది. ఆ దాడిలో 40 మంది మరణించారు. మరో 52 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన చేసింది. వేర్వేరుగా 10 చోట్ల దాడులు జరపడంతో మరికొందరు చనిపోయినట్లు వెల్లడించింది. దక్షిణ లెబనాన్‌లోని నబాతియే జిల్లాలో ఇజ్రాయెల్ జరిపిన మిసైల్స్ దాడిలో ఏడుగురు చనిపోయారని.. మరో 24 మంది గాయపడినట్లు తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని పలుచోట్ల జరిగిన దాడుల్లో మరో ఐదుగురు చనిపోగా.. మరో 26 మంది గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా.. హెజ్ బొల్లా లక్ష్యంగా లెబనాన్ పై గత 11 నెలలుగా ఇజ్రాయెల దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 3,583 మంది చనిపోయారని లెబనాన్ పేర్కొంది.
హెజ్ బొల్లా దాడులు
దక్షిణ బీరూట్ లోని హెజ్ బొల్లాలకు చెందిన ఆయుధ డిపో, కమాండ్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా దాడులు చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి అవిచాయ్ అడ్రే ప్రకటించారు. ఈ దాడుల్లో 52 మంది చనిపోయినట్లు వెల్లడించారు. మరోవైపు, సెప్టెంబర్ 30న ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ లోకి ప్రవేశించాయి. దీంతో, హెజ్ బొల్లా కూడా శత్రుదళాలపై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంలోని హట్జోర్ ఎయిర్ బేస్(Hatzor air base) ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు హెజ్ బొల్లా వెల్లడించింది. లెబనాన్ లోని ఖియామ్ ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్ దళాలను కూడా లక్ష్యంగా చేసుకున్నామంది.