టెన్షన్...టెన్షన్.. ఎమ్మెల్యేల అనర్హత అప్పీళ్లపై నేడే తీర్పు

by Aamani |
టెన్షన్...టెన్షన్.. ఎమ్మెల్యేల అనర్హత అప్పీళ్లపై నేడే తీర్పు
X

దిశ,భద్రాచలం : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు నేడు తుది తీర్పు వెల్లడించనుండడంతో భద్రాచలం నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తీర్పు ఎమ్మెల్యేకు అనుకూలంగా వస్తుందా... లేక ప్రతికూలంగా వస్తుందా..? అనే చర్చ జోరుగా సాగుతుంది. ఒకవేళ ప్రతికూలంగా వస్తే ఏం చేయాలో ఇప్పటి నుండే సమాలోచనలు జరుపుతున్నారు.

బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి, ఎన్నికలు అనంతరం కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఎమ్మెల్యే లు కడియం శ్రీహరి, డాక్టర్ తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ లపై అనర్హత వేటు వేయాలంటూ ఎమ్మెల్యే లు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద, మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయుంచారు.పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలానే వ్యాజ్యాలపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి. నరసింహ చార్యులు పిటిషన్ దాఖలు చేశారు.బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే లు దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తూ సింగిల్ జడ్జి సెప్టెంబర్ 9 న ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని దాఖలైన రెండు పిటిషన్ లపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నెల 12 న వాదనలు ముగించింది. ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే, జస్టిస్ జె. శ్రీనివాసరావు తో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పు వెల్లడించనుంది.

అనర్హత వేటు వేస్తే...!

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు అనర్హత వేటు వేస్తూ తీర్పు చెప్తే... మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనే విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్దిగా పొదెం వీరయ్య పోటీ చేయగా, డాక్టర్ తెల్లం వెంకట్రావు బి ఆర్ ఎస్ పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఇప్పుడు అనర్హత వేటు పడితే బీఆర్ఎస్ అభ్యర్దిగా పోటీ చేయడానికి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కాగా కాంగ్రెస్ నుండి పోటీ చేయడానికి మాజీ ఎమ్మెల్యే, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెల్లం వెంకట్రావుకు తిరిగి టికెట్ కేటాయుంచే అవకాశం పై సందేహం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed