- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసలు కుట్రంతా ఆ ఫోన్‌లోనే.. పిన్ తెలియక పోలీసులు సతమతం
దిశ, సిటీక్రైం: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల ఘటన కుట్ర కోణం రహస్యమంతా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మొబైల్ ఫోన్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ రహస్యాన్ని చేధించాలంటే పోలీసులకు నరేందర్ రెడ్డి ఫోన్ పిన్ నెంబర్ కావాలి. ఇప్పుడు ఆ పిన్ నెంబర్ కోసం పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. అందుకే నరేందర్ రెడ్డిని తమ కస్టడీలోకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు. నరేందర్ రెడ్డి అరెస్టు సమయంలో పోలీసులు ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటికీ పిన్ నెంబర్‌ను తెలుసుకోలేకపోయారు.
దీంతో ఫోన్ ఓపెన్ చేయలేక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఆ పిన్ నెంబరు తెలుసుకుని ఫోన్‌ను శోధిస్తే ఏ-2 బోగమోని సురేశ్ రాజ్‌తో మాట్లాడిన సంభాషణతో పాటు ఇంకా ఎవరెవరితో మాట్లాడారనేది తెలుస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఫోన్ పిన్ పోలీసులకు లభిస్తుందా? లేదా? అనే అంశం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం నరేందర్ రెడ్డి అరెస్టు అంశం కోర్టు పరిధిలోకి వెళ్లింది. దీంతో ప్రస్తుతం పోలీసులు సైతం కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.