నాలా కన్వర్షన్ కు దరఖాస్తు చేసుకున్న సినీ నటుడు అలీ

by Kalyani |
నాలా కన్వర్షన్ కు దరఖాస్తు చేసుకున్న సినీ నటుడు అలీ
X

దిశ, ప్రతినిధి వికారాబాద్ : ప్రముఖ సినీ హాస్య నటుడు ఆలీ వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం ఎక్ మామిడి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 345 లో గల తన వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపడుతున్నారని ఎక్ మామిడి కార్యదర్శి నోటీసులు ఇవ్వడం జరిగింది. అలీ సినీ నటుడు కావడంతో రాష్ట్రంలో ఈ న్యూస్ సంచలనంగా మారింది. గత మూడు రోజులుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వరుస కథనాలు రావడంతో అలీ స్పందించారు.

సోమవారం నవాబ్ పేట్ మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆయన, ఎక్ మామిడి రెవెన్యూ పరిధిలో తనకు ఉన్న అగ్రికల్చర్ భూమిని నాన్ అగ్రికల్చర్ గా మార్చేందుకు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా తహసీల్దార్ జయరామ్ కు దరఖాస్తు అందచేశారు. మొత్తం 12 ఎకరాల భూమిలో గతంలోనే 6 ఎకరాల భూమిని నాన్ అగ్రికల్చర్ గా మార్చుకున్న ఆయన, ఇప్పుడు మిగిలిన 6 ఎకరాల భూమికి సైతం నాలా అనుమతులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే రెవెన్యూ శాఖ నుండి నాలా అనుమతులు తీసుకున్నప్పటికీ భావన నిర్మాణాలు చేసే సమయంలో డీటీసీపీ అనుమతులతో పాటు గ్రామ పంచాయతీ అనుమతులు కూడా తప్పనిసరి. మరి ఈ అనుమతులు ఎప్పుడు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

సినీ నటుడు అలీ నాలా కన్వర్షన్ చేసుకున్నారు : తహసీల్దార్ జయరామ్

సినీ నటుడు అలీ నవాబుపేట మండలం, ఎక్ మామిడి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 345 లో తనకు ఉన్న భూమికి నాలా కన్వర్షన్ చేసుకున్నారు. మొత్తం 12 ఎకరాల భూమి ఉండగా, గతంలోనే 6 ఎకరాల భూమికి నాలా అనుమతులు తీసుకోగా, ఇప్పుడు మిగిలిన 6 ఎకరాలకు కూడా నాలా అనుమతులు తీసుకున్నారని నవాబ్ పేట్ తహసీల్దార్ జయరామ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed