UPI Transactions: యూపీఐ నగదు చెల్లింపుల్లో రూ. 485 కోట్ల విలువైన మోసాలు..!

by Maddikunta Saikiran |
UPI Transactions: యూపీఐ నగదు చెల్లింపుల్లో రూ. 485 కోట్ల విలువైన మోసాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో గత కొన్ని నెలల నుంచి యూపీఐ(UPI) ద్వారా నగదు చెల్లింపుల(Cash Payments) వినియోగం పెరుగుతున్న విషయం తెలిసిందే. యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క క్యూఆర్ కోడ్(QR Code)లను స్కాన్ చేసి ఆన్‌లైన్(Online)లో ట్రాన్సక్షన్స్ జరుపుతున్నారు. కాగా అదే సమయంలో యూపీఐకి సంబంధించిన మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు(Cyber ​​Criminals) యూపీఐ ద్వారా అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారు. వినియోగదారులకు తప్పుడు లింక్‌లను పంపిస్తూ వాటిని క్లిక్‌ చేయగానే పూర్తి సమాచారం నేరగాళ్లకు చేరిపోతుంది. దీంతో క్షణాల్లోనే మీ బ్యాంక్ అకౌంట్‌(Bank Account)లో ఉన్న డబ్బులు ఖాళీ అయిపోతాయి.

ఇదిలా ఉంటే 2024-25 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకూ యూపీఐ నగదు చెల్లింపుల్లో రూ. 485 కోట్ల విలువైన 6.32 లక్షల మోసాలు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే 2023-24 ఫైనాన్సియల్ ఇయర్(FY)లో కేటుగాళ్లు రూ.1,087 కోట్ల విలువైన రూ. 13.42 లక్షల మోసాలకు పాల్పడ్డట్లు తెలిపింది. మోసాల కట్టడికి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్న పలువురు సైబర్ నేరగాళ్ల ట్రాప్ లో పడుతున్నారని పేర్కొంది. యూపీఐ/ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ లో మోసాలు ఎదురైతే 1930 అనే నెంబర్ కు ఫోన్ చేయాలని, లేదా అధికారిక వెబ్‌సైట్ https://www.cybercrime.gov.in/ లో ఫిర్యాదు చేయాలని సూచించింది.

Advertisement

Next Story