UNO : ల్యాండ్ మైన్స్ వాడకం నిషేధించండి : ఐక్యరాజ్యసమితి

by M.Rajitha |
UNO : ల్యాండ్ మైన్స్ వాడకం నిషేధించండి : ఐక్యరాజ్యసమితి
X

దిశ, వెబ్ డెస్క్ : ల్యాండ్ మైన్స్ వాడకంపై ఐక్యరాజ్యసమితి(UNO) సంచలన నిర్ణయం ప్రకటించింది. యాంటీపర్సనల్ ల్యాండ్ మైన్స్(AntiPersonnel Land Mines) ఉత్పత్తి, వాడకం తక్షణమే నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఆంటోనియో గుటేరస్(UNO Chief Antonio Guterres) ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. కాంబోడియాలో ఏర్పాటు చేసిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఒట్టావా ఒప్పందం(Ottawa Treaty) అమలు చేయని కొన్ని దేశాలు ల్యాండ్ మైన్స్ ను ఇంకా వాడుతున్నాయని, వాటి వల్ల మరింత ప్రాణహాని జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా, గాజా, పాకిస్థాన్, భారత్, మయన్మార్, కాంబోడియా దేశాల్లో ల్యాండ్ మైన్స్ ను విరివిగా ఉపయోగిస్తున్నారని.. వీటి కారణంగా గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 5757 మంది మృత్యువు పాలయ్యారని తెలియ జేశారు. యుద్ధాలు, గొడవలు ముగిసినప్పటికీ.. వీటి ముప్పు తర్వాత తరాలపై ఉదా ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలు ల్యాండ్ మైన్స్ ను పూర్తిగా నిషేధించాలని పిలుపునిస్తున్నట్టు గుటేరస్ పేర్కొన్నారు.

Advertisement

Next Story