- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Minister Ponguleti:‘ప్రభుత్వంలో నా స్థానం పదకొండు’.. మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ,వెబ్‌డెస్క్: ప్రభుత్వంలో తాను 11వ స్థానంలో ఉన్నానని రెవెన్యూ, గృహ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. సచివాలయంలో గురువారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలపై మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ తర్వాత స్థానంలో ఎవరు ఉన్నారని ఎదురైన ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు. రెండో స్థానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారని చెప్పారు. అటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావొస్తున్న సందర్భంగా డిసెంబర్ 7 లోపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని పొంగులేటి అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే(Assembly Meetings) పలు కీలక బిల్లులను ఆమోదించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కొత్త ఆర్వోఆర్ బిల్లుకు ఆమోదం తెలిపి.. చట్టంగా తీసుకొస్తామని తెలిపారు. డిసెంబరు నుంచే కొత్త ఆర్వోఆర్ చట్టం అమల్లోకి వస్తుందన్నారు. ఇటీవల సీఎంతో జరిగిన సమావేశంలో ఆర్వోఆర్ ముసాయిదాపై స్వల్ప చర్చ జరిగిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు.