- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
T-బీజేపీలో కీలక పరిణామం.. హైకమాండ్ నుండి రఘునందన్ రావు, కొండాకు పిలుపు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మార్పు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తుండగా.. దానిపై ఇవాళ క్లారిటీ రానున్నట్లు సమాచారం. సోమవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్. బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలు రాష్ట్ర బీజేపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగానే.. ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ బీజేపీ నేతలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు బీజేపీ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. దీంతో వీరు ఇవాళ ఢిల్లీ బయలుదేరనున్నారు. స్టేట్ బీజేపీ చీఫ్ మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోన్న వేళ రాష్ట్ర నేతలైన కొండా, రఘునందన్ రావుకు ఢిల్లీ నుండి పిలుపు రావడం హాట్ టాపిక్‌గా మారింది.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇటీవల పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో తనకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పదవుల విషయంలో తనకు అన్యాయం జరుగుతోందని.. పార్టీ కోసం కష్టపడి పని చేసిన తమను పార్టీ పదవుల కేటాయింపుల్లో పరిగణలోకి తీసుకోవడం లేదని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ తర్వాత బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి అడిగినా తనకు ఇవ్వలేదని, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి లేదా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అవకాశం వస్తుందని ఎదురుచూసినా ఫలితం దక్కలేదని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుండి ఎమ్మెల్యే రఘనందన్ రావుకు పిలుపు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రఘునందన్ రావుకు బీజేపీలో ఏదో ఒక పదవి దక్కబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.