- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR: సీఎంను ఎవరో తప్పుదోవ పట్టిస్తుండ్రు.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) కేసు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తనపై ఏసీబీ (ACB) అధికారులు నాన్ బెయిలబుల్ (Non-Bailable) కేసులు నమోదు చేయడం పట్ల తాజాగా కేటీఆర్ (KTR) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) నిర్వహణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి సమాచార లోపం ఉందని కామెంట్ చేశారు. కావాలని ఎవరో ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఏమాత్రం నిలవబోవని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము న్యాయపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. అందుకే ఇవాళ హైకోర్టు (High Court)లో లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలు చేశామని వెల్లడించారు.
ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) నిర్వహణకు సంబంధించి ప్రభుత్వంలో భాగస్వామి అయిన మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారని గుర్తు చేశారు. ఈ విషయంలో ఏసీబీ (ACB) అధికారులు కేసు ఎందుకు పెట్టారో వాళ్లకే తెలియాలని అన్నారు. ఓ మంత్రిగా తాను ఫార్ములా ఈ-రేస్ (Formula E-Race) విషయంలో విధాన పరమైన నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. డబ్బులు పంపిన విధానం తప్పు అంటూ మంత్రి పొన్నం అంటున్నారని.. ఈ విషయంలో ఏసీబీ (ACB)కి కేసు పెట్టే అర్హతే లేదన్నారు. ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో అర పైసా కూడా అవినీతి జరగలేదని క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా కోకాపేట భూములు (Kokapet Lands), ఓఆర్ఆర్ టెండర్ల (ORR Tenders)పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. తనను ఏ కేసులో జైలుకు పంపాలో సర్కారుకు అర్థం కావడం లేదంటూ కేటీఆర్ (KTR) సెటైర్లు వేశారు.