‘వేధిస్తే 100కి కాల్ చేయండి’

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-13 13:41:36.0  )
‘వేధిస్తే 100కి కాల్ చేయండి’
X

దిశ, కాసిపేట: మండలంలోని కస్తూర్భా పాఠశాలలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, ఉమెన్ సేఫ్టీ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాసిపేట ఎస్ఐ గంగారాం మాట్లాడుతూ.. సైబర్ నేరస్తులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సెల్ ఫోను ఉపయోగించినప్పుడు ముందుగా ఎలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ సైబర్ క్రైమ్ జరిగినప్పుడు 1930 హెల్ప్ లైన్ నంబర్‌కి వెంటనే ఫోన్ చేయడం ద్వారా లేదా www.cybercrime.gov.in online lo ఫిర్యాదు చేయడం ద్వారా పోలీసు వారు వెంటనే సైబర్ క్రైమ్ బాధితులకు న్యాయం జరిగే విధంగా తగు చర్య తీసుకుంటామని తెలిపారు.

బాలికలు, మహిళలకు ఆకతాయిల వల్ల ఎలాంటి ఇబ్బందులు, హాని జరగకుండా పెట్రోలింగ్, ఇతర ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఆకతాయిలు బాలికలు, మహిళలను ఇబ్బంది పెట్టి, వేధించినట్లయితే Dial 100కి ఫోన్ చేయడం ద్వారా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆకతాయిలపై తగు చర్య తీసుకొని బాధితులకు తగిన రక్షణ ఇస్తారని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed