Cabinet Meeting: మరికొద్ది గంటల్లో కేబినెట్ భేటీ.. ఆ మూడు అంశాలపైనే ప్రధాన చర్చ!

by Shiva |   ( Updated:2024-05-20 14:07:07.0  )
Cabinet Meeting: మరికొద్ది గంటల్లో కేబినెట్ భేటీ.. ఆ మూడు అంశాలపైనే ప్రధాన చర్చ!
X

దిశ, వెబ్‌‌డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. అయితే, రాష్ట్రంలో అత్యవసర విషయాలపైనే చర్చించాలని, అదేవిధంగా ఉమ్మడి రాజధాని, రుణమాఫీపై ఎలాంటి చర్చ చేయకూడదంటూ ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా లోక్‌సభ ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం అయిన అధికారులను కేబినెట్ భేటీలో పాల్గొనేందుకు వీలు లేదని స్పష్టం చేసింది.

దీంతో చేసేదేమి లేక ప్రభుత్వం రాష్ట్రంలో అకాల వర్షాలతో దెబ్బతిన పంటలు, ధాన్యం కొనుగోళ్లపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా విద్యార్థులకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో నూతన విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన పనులు, బుక్స్, స్కూల్ యూనిఫాం లాంటి అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా మేడిగడ్డకు మరమ్మతులు, రాష్ట్రంలోని ఇతర ప్రధాన ప్రాజెక్టుల నిర్వహణ కోసం కేబినెట్‌లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ భేటీలో ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు కాకుండా మంత్రులు, సీఎం, ఇతర అధికారులు హాజరుకానున్నారు.

Read More...

BREAKING: ముగిసిన కేబినెట్ భేటీ.. కాంగ్రెస్ సర్కార్ మరో కీలక నిర్ణయం

Advertisement

Next Story

Most Viewed