- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యాదాద్రి జిల్లాలో బస్సు ప్రమాదం.. క్షతగాత్రుల తరలింపులో పోలీసుల చొరవకు ప్రశంసలు
X
దిశ, వలిగొండ: మండల పరిధిలోని టేకుల గ్రామంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకుని పోలీసులు హుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సమయస్ఫూర్తితో వ్యహహరించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో ప్రత్యేక చొరవ చూపారు. ప్రమాదంలో గాయపడి సీటులో ఇరుక్కుపోయిన బస్సు డ్రైవర్‌ను సుమారు అరగంట పాటు శ్రమించి బయటకి తీశారు.
క్షత గాత్రులను తరలించడానికి 108 అంబులెన్స్‌లు వెంటనే రప్పించారు. అయితే క్షత గాత్రులు ఎక్కువ మంది ఉండటంతో అంబులెన్స్ కొరత ఏర్పడింది. దీంతో పోలీసులే రంగంలోకి దిగి తమ పోలీసు వాహనంలో నే బస్సు డ్రైవర్‌తో పాటు క్షత గాత్రులను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షత గాత్రుల తరలింపులో ప్రత్యేక చొరవ చూపిన పోలీసుల సమయస్ఫూర్తిని పలువురు ప్రశంసించారు.
Advertisement
Next Story