Breaking: ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్.. ప్రయాణికుల పరిస్థితి ..?

by Indraja |   ( Updated:2024-02-02 05:48:06.0  )
Breaking: ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్.. ప్రయాణికుల పరిస్థితి ..?
X

దిశ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో బస్సు పలు వాహనాల పైకి దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఈ రోజు హైదరాబాద్ లోని హయత్ నగర్ పరిధి లోని భాగ్యలత అయాన్ డిజిటల్ సెంటర్ వద్ద విషాదకర సంఘటన చోటు చేసుకుంది. దిల్‌సుఖ్ నగర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు హయత్ నగర్ పరిధి లోని భాగ్యలత అయాన్ డిజిటల్ సెంటర్ దగ్గరికి వచ్చేసరికి బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యింది.

దీనితో బస్సు ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టింది.ఈ ఘటనలో రెండు ఆటోలు, అనేక బైకులు, రెండు కార్లు ప్రమాదానికి గురైయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ ఆటో లోని మహిళ తల పగులగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా స్థానికుల సమాచారం అనుదుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అలానే ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా బస్సు బ్రేక్ ఫెయిల్ అయిన విషయం గమనించిన బస్సు డ్రైవర్ బ్రేక్ ఫెయిల్ అయ్యిందని పక్కకు తప్పుకోమని పెద్దగా అరిచినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story