స్కాముల్లో సీఎం ఫ్యామిలీ బిజీ.. పేపర్ లీకేజీ ఘటనపై RSP సీరియస్

by GSrikanth |
స్కాముల్లో సీఎం ఫ్యామిలీ బిజీ.. పేపర్ లీకేజీ ఘటనపై RSP సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై బీఓస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కుటుంబం స్కాముల్లో పీకలదాకా మునిగిందని, ఇక నిరుద్యోగుల ఇబ్బందులు వారికెలా కనిపిస్తాయంటూ విమర్శలు గుప్పించారు. రోజు స్కామర్లను రక్షించడంలో బిజీగా ఉంటే, పాలన స్తంభిస్తుందని, ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని మండిపడ్డారు. తెలంగాణలో రాకరాక ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయని, నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూడకముందే, కళ్ళల్లో కారం చల్లినంత వార్త వినాల్సి వచ్చిందిని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశ్నా పత్రాలు లీక్ చేస్తే.. ఉద్యోగం కోసం కారం మెతుకులు తిని, అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటున్నవారు ఏమైపోవాలి కేసీఆర్? అని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇక, బీఆర్ఎస్ లీకేజీ పాలనకు తెరదించాల్సిందేనని, కేసీఆర్ కో హఠావో-తెలంగాణకో బచావో అంటూ ఆర్ఎస్పీ ఫైర్ అయ్యారు. కాగా, పేపర్ లీకేజీ వ్యవహారంతో ఆదివారం జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష, 15,16వ తేదీల్లో నిర్వహించాల్సిన వెట‌ర్నరీ అసిస్టెంట్ స‌ర్జన్ రాత‌ప‌రీక్షను వాయిదా వేస్తున్నట్లుగా టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story