- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్, డీజీపీ ఫ్లెక్సీలేనా.. పోలీస్ అమరవీరుల ఫ్లెక్సీలు ఎక్కడ?: ఆర్ఎస్ ప్రవీణ్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రం అవతరించి 10 ఏళ్ల కావొస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోంది. కాగా ఈ ఉత్సవాలపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈ ఉత్సవాల్లో ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్, డీజేపీ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయని, తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసుల ఫ్లెక్సీలు ఎక్కడ అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య, పదవీ త్యాగం చేసిన డీఎస్పీ నళిని, ఆంధ్ర పాలకులను ఎదిరించిన ఏఆర్పీసీ శ్రీనివాస్ గౌడ్ ల గురించి ఎవరూ మాట్లాడటం లేదని మండిపడ్డారు.
వీళ్లంతా బహుజన బిడ్డలనే చిన్నచూపుతోనే పాలకులు వారికి సరైన గౌరవం ఇవ్వడంలేదని ఆరోపించారు. హోం గార్డుల వేతనాలు, రెగ్యులరైజేషన్ ఏమయ్యాయని ప్రశ్నించారు. అదేవిధంగా పోలీసుల మూడు సరెండర్ లీవులు ఏమైనవని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు. బహుజన రాజ్యంలో అమరులను సైరైన రీతిలో గౌరవించుకుంటామని హామీ ఇచ్చారు.