అన్న చేతిలో తమ్ముడు దారుణ హత్య

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-28 08:01:08.0  )
అన్న చేతిలో తమ్ముడు దారుణ హత్య
X

దిశ, బిచ్కుంద : అన్న చేతిలో తమ్ముడు దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోనాల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మద్నూర్ మండలం సోనాల గ్రామానికి చెందిన రాజు పటేల్ మరియు విజయ్ పటేల్‌ల మధ్య గత కొన్ని రోజులుగా ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల గొడవలు మరింత పెరగడంతో హత్యకు తమ్ముడి హత్యకు దారి తీశాయి. ఆదివారం ఉదయం తెల్లవారుజామున రాజు పటేల్ మరియు విజయ పటేల్ మధ్య తగాదా జరగడంతో రాజు పటేల్ కత్తితో విజయ పటేల్ పోట్టలో పొడవడంతో చనిపోయినట్లు బిచ్కుంద సీఐ కృష్ణ తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story