హరీశ్‌రావు కాదు.. రేవంత్ రెడ్డినే రాజీనామా చేయాలి: బీఆర్ఎస్వీ డిమాండ్

by srinivas |   ( Updated:2024-08-16 14:59:00.0  )
హరీశ్‌రావు కాదు.. రేవంత్ రెడ్డినే రాజీనామా  చేయాలి: బీఆర్ఎస్వీ డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: రైతులకు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షలు రుణమాఫీ చేయడంతో మాజీ మంత్రి హరీశ్ రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు సర్కార్ రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్ వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ అసెంబ్లీ సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఎంపీ ఎన్నికల ముందు రూ. 41 వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని, ఇప్పుడు రూ. 18 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని, మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డినే రాజీనామా చేయాలని గెల్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రైతులను నమ్మించడానికి దేవుళ్ళమీద ఒట్టు పెట్టి వాళ్ల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డికి హరీష్ రావుని రాజీనామా చేయమని హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. రైతు రుణమాఫీతోపాటు ఆరు గ్యారంటీలను అమలు చేస్తే రాజీనామాకు సిద్ధమని ఏప్రిల్ 26న రాసిన బహిరంగ లేఖకు తాము కట్టుబడి ఉన్నామని గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పష్టంచేశారు.

Advertisement

Next Story