KTR: ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేసిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

by Anjali |   ( Updated:2024-08-31 08:21:18.0  )
KTR: ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేసిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని కాంగ్రెస్ సర్కారు అస్తవ్యస్థంగా మార్చేసిందని ఓ రేంజ్‌లో మండిపడ్డారు. విద్యార్థులు లేరంటూ 1,864 స్కూళ్లను మూసేసే కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. పేద, మధ్య తరగతి విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేసే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ల నియామకం, మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన ఆహారం అందించటంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రమాదం అంచున ప్రభుత్వ విద్య తెలంగాణకు మంచిది కాదని కేటీఆర్ కాంగ్రెస్ సర్కారుపై ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు విద్యావేత్తలు, మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed