మళ్లీ గెలిచేది బీఆర్ఎస్సే : మంత్రి హరీష్ రావు

by samatah |
మళ్లీ గెలిచేది బీఆర్ఎస్సే : మంత్రి హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. కొరఢాతో కాంగ్రెస్ వారిని కొట్టడం లేదని వాళ్లకు వాళ్లే కొట్టుకుంటున్నారన్నారు. ఒక్కవేలిని చూపితే మూడు వేళ్లు మీ వైపై చూపుతారన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ఆరోపణలు మానుకోవాలని సూచించారు. 'మేం కొట్టే ప్రయత్నం చేయడంలేదని... మీకు మీరే కొట్టుకుంటున్నారని.. మీదగ్గరే సుతిలేదని' భట్టి విక్రమార్కను ఉద్దేశించి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు కాంగ్రెస్ నేతలు వెళ్లిన సమయంలో బురదపడుతుందని, జారీ పడతారని మాత్రమే పోలీసులు అడ్డుకున్నారని, కాంగ్రెస్ నేతలు ఎప్పుడు వెళ్తారో చెబితే ఏర్పాట్లు చేస్తామని, భోజనం చేయిస్తామని అన్నారు. '

Advertisement

Next Story

Most Viewed