పొర్లు దండాలు పెట్టినా.. మళ్ళీ BRSదే విజయం : KTR

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-09 08:53:25.0  )
పొర్లు దండాలు పెట్టినా.. మళ్ళీ BRSదే విజయం : KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ పెద్దలు, పరాయి రాష్ట్ర గద్దల చేతిలో పావులుగా మారిన రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా, మళ్ళీ తెలంగాణదే ఘన విజయమని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ప్రగతి భవన్ లో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ వ్యాసాల సంకలనం"దారి చూపిన దశాబ్ది"పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పదేళ్ల రాష్ట్ర ప్రగతి పథం దేశ పాలనా చరిత్రలో నూతన అధ్యాయమని అన్నారు. సాగు, సంక్షేమ, పారిశ్రామిక రంగాల్లో సీఎం కేసీఆర్ అమలుచేసిన విధానాలు అధ్భుతమైన ఫలితాలనిచ్చాయన్నారు.

దేశంలో ఒకటో, రెండో రంగాల్లో మిశ్రమ ఫలితాలకే క్షీర విప్లవం, హరిత విప్లవమని కాంగ్రెస్, బీజేపీ సర్కార్ లు డబ్బా కొట్టుకున్నాయని, కానీ అన్ని రంగాల్లో మన తెలంగాణ రాష్ట్రం సాధించిన పదేళ్ల ప్రగతి విప్లవాన్ని బుద్ధి జీవులు ఎంత ప్రజల్లో భావవ్యాప్తి చేయాలో అర్థం చేసుకొని, భాధ్యత తీసుకోవాలని కోరారు. తన వ్యాసాల ద్వారా తెలంగాణ రాష్ట్ర పురోగతిని ఎత్తి పట్టడంతో పాటు, బీజేపీ, కాంగ్రెస్‌ల అమానవీయ రాజకీయ నైజాన్ని బహిర్గతం చేస్తున్న ఆంజనేయ గౌడ్ కృషి ప్రశంసనీయమన్నా‌రు. ఆలోచన పరులు కీలకమైన ఎన్నికల సంధర్భంగా క్రియాశీల పాత్ర పోషించి, బీఆర్ఎస్ గెలుపు‌లో భావవ్యాప్తికి సారధ్యం వహించాలని అన్నారు. అనంతరం ఆంజనేయ గౌడ్ సారధ్యంలో పాలమూరు గాయకుడు రేలారే ప్రసాద్ రచించి, ఆలాపించిన ‘గుండెకత్తుకుందమా..గులాబీ జెండాను’ పాటను సైతం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ సి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, తెలంగాణ గాయకుడు రేలారే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed