- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆరెస్.. గంగలో కలిసిన పార్టీ.! బండి సంజయ్
దిశ, వెబ్ డెస్క్: బీఆరెస్ అనేది ఎప్పుడో గంగలో కలిసిన పార్టీ అని.. కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. అవినీతి, కుటుంబ పార్టీలకు బీజేపీ దూరమని అన్నారు. బీఆరెస్ ను బీజేపీలో విలీనం చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ ను ప్రజలు చీదరించుకుంటున్నారని దుయ్యబట్టారు. బీజేపీలో బీఆరెస్ కలవడం కాదు, బీఆరెస్ త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం కాబోతుందని తెలిపారు. అందుకే బీఆరెస్ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ లోన్ చేరారని విమర్శించారు బండి సంజయ్. "అసలు కేసీఆర్ ప్రస్థానం మొదలైందే.. కాంగ్రెస్ లో అని, తమకు ఎవరి మద్దతు అవసరం లేదని, మాకు ప్రజల మద్దతు ఉంటే చాలని అన్నారు. ఎన్నికలలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను పక్క దోవ పట్టించడానికే.. కొత్తగా ఈ విలీన ప్రచారాన్ని తెర మీదకు తెచ్చారని తెలిపారు. రుణమాఫీపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వారి తరఫున బీజేపీ కొట్లాడుతుంది" అని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు.