- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ వ్యూహంలో చిక్కుకున్న గులాబీ పార్టీ!
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ నిత్యం ఏదో ఒక క్రైసిస్‌లో ఇరుక్కుంటూ ఉన్నది. మొన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అరెకపూడి గాంధీని స్పీకర్ ఎంపిక చేసినప్పుడు వారం రోజుల పాటు బీఆర్ఎస్ గగ్గోలు పెట్టింది. ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన అవకాశాన్ని అధికార పార్టీలో చేరిన వ్యక్తికి ఎలా ఇస్తారంటూ ఆందోళనకు దిగింది. ఇప్పుడు శాసనమండలిలో చీఫ్ విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డిని నియమిస్తూ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నియామక ఉత్తర్వులు జారీచేశారు. దానికి అనుగుణంగా పట్నం బాధ్యతలను కూడా స్వీకరించారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తిగా మారినందునే చీఫ్ విప్ పోస్టును ఆయనకు కట్టబెట్టినట్టు బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఆయనపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ చైర్మన్ దగ్గర పెండింగ్‌లో ఉండగానే ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పన్నిన వ్యూహంలో బీఆర్ఎస్ చిక్కుకున్నది.
రాష్ట్ర ప్రభుత్వ వ్యూహంపై బీఆర్ఎస్ పార్టీలో చర్చ
ప్రతిపక్ష పార్టీకి పీఏసీ చైర్మన్ పోస్టు ఇవ్వలేదనే ఆవేదన ఒకవైపు ఉంటే బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన ఎమ్మెల్సీ పట్న మహేందర్‌రెడ్డిని మండలిలో చీఫ్ విప్‌గా నియమించడం మరోవైపు ఆందోళనకు కారణమైంది. మండలిలో జరిగే ప్రభుత్వ కార్యకలాపాలు, ముఖ్యమైన బిల్లులపై చర్చ, ఓటింగ్ సందర్భంగా చీఫ్ విప్ హోదాలో పట్నం మహేందర్‌రెడ్డి విప్ జారీచేస్తే అది అధికార పార్టీకి వర్తిస్తుందా?.. లేక బీఆర్ఎస్‌కు వర్తిస్తుందా?.. అనే సందేహాన్ని హరీశ్‌రావు వ్యక్తం చేయడంతో పాటు టెక్నికల్‌గా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినందున గులాబీ పార్టీ జారీ చేసే విప్‌నకు కట్టుబడి ఉండక తప్పదనే లాజిక్‌ను తెరమీదకు తెచ్చారు. మహేందర్‌రెడ్డికి మండలి చైర్మన్ ఈ బాధ్యతలు అప్పజెప్పడంతో ఇకపైన కీలకమైన బిల్లుల ఆమోదం సమయంలో ఆయన ఎలాంటి రోల్ పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నియామకం వెనక వ్యూహంపైనే ఇప్పుడు బీఆర్ఎస్‌లో చర్చనీయాంశమైంది.
ఒక్క పదవితో క్యాస్ట్ ఓటు బ్యాంకు షిఫ్ట్!
బీఆర్ఎస్ నేతలకు వరుస పదవులు రావడం ఆ పార్టీ నాయకత్వానికి మింగుడుపడటంలేదు. అరెకపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమించడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతున్నది. టెక్నికల్‌గా ఆయన బీఆర్ఎస్ పార్టీకి చెందినప్పటికీ కాంగ్రెస్‌వైపు వెళ్లినందున ఆనవాయితీ ప్రకారం ఆ పదవిని ప్రతిపక్షానికి ఇచ్చినట్లుగా భావించలేమన్నది ఆ పార్టీ నేతల వాదన. ఇంకోవైపు గాంధీ సామాజికవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలంగా ఉన్నందున వారి ప్రతినిధిగా ఆయనను భావించే అవకాశమున్నదని, ఆ రకంగా ఆ క్యాస్ట్ ఓటు బ్యాంకు బీఆర్ఎస్‌కు దూరమై కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉన్నదనేది గులాబీ లీడర్ల మరో ఆందోళన. ఒక్క పదవి బీఆర్ఎస్ పార్టీని రెండు రకాలుగా ఇబ్బందుల్లోకి నెట్టింది. సీనియర్ నేతకు వస్తుందన్న పదవి చేజారడంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నష్టం జరిగే ప్రమాదాన్ని శంకిస్తున్నది.
బీఆర్ఎస్‌లో అలజడి కంటిన్యూ
ఇంకోవైపు పట్నం మహేందర్‌రెడ్డిని చీఫ్ విప్‌గా నియమించిన విషయంలో సైతం ఆ సామాజికవర్గం ఓటు బ్యాంకు దూరం కానున్నదనే అనుమానం బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సైతం ఆ కుటుంబం ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పడవచ్చని, అది కాంగ్రెస్‌కు అనుకూలంగా మారవచ్చనే చర్చలు ఇప్పటికే గులాబీ నేతల్లో మొదలయ్యాయి. రెండు ప్రధాన సామాజికవర్గాల ఓటు బ్యాంకు బీఆర్ఎస్ నేతల్లో గుబులు రేకెత్తిస్తున్నది. సీఎం రేవంత్ వ్యూహం అర్థం కాక అందులో చిక్కుకున్న గులాబీ లీడర్లు పీఏసీ చైర్మన్‌గా అరెకపూడి గాంధీని నియమించిన టైమ్‌లో వారం పది రోజుల పాటు హడావిడి వాతావరణం కొనసాగింది. ఇప్పుడు పట్నం మహేందర్‌రెడ్డిని మండలిలో చీఫ్ విప్‌గా నియమించిన తర్వాత కూడా అదే తరహా విమర్శలు, అలజడి కంటిన్యూ అవుతున్నది.