కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాం.. ఓటమిపై BRS ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాం.. ఓటమిపై BRS ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మనం కూర్చున్న చెట్టు కొమ్మను మనమే నరుక్కున్నామని అభిప్రాయపడ్డారు. ఒక ఎమ్మెల్యే ఓడిపోతే ఏం కాదు అనే భావనతో మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కునే స్థితికి వచ్చామని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో మొట్ట మొదటి సారిగా తనను ఇంచార్జీగా ఉంచారు.. రెండు నియోజకవర్గాల ఇంచార్జిగా ఉన్నాను.

కొత్తగూడెం కచ్చితంగా గెలుస్తాం అనుకున్నా.. కానీ జనం నాడి తెలుసుకోలేక పోయాం అని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వారు రాష్ట్రంలో 38 మంది గెలిచారని తెలిపారు. దీన్ని బట్టి ప్రజల నాడి ఎలా ఉంటుందో మనం అర్ధం చేసుకోవాలని హితవు పలికారు. ఇప్పుడు చెట్టు కూలి పొయే పరిస్థితికి తెచ్చుకున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ సమ్యసల కోసం కొట్లాడే ఏకైక వ్యక్తి నామ నాగేశ్వరావు అని అన్నారు. అంతేకాదు.. కేటీఆర్ సమక్షంలో నామా నాగేశ్వరావుకే ఎంపీ సీటు ఇవ్వాలని వద్దిరాజు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story