- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మార్టీ మార్పు వార్తలపై స్పందించిన BRS MLA
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్‌కు కీలక నేతలంతా వరుసగా హ్యాండిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, కవిత జైల్లో ఉండి తీవ్ర కష్టాల్లో ఉన్న ఆ పార్టీని అదునుచూసి దెబ్బ కొడుతున్నారు. మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీల్లో చేరారు. వీరితో పాటు మరో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతారని పదే పదే కాంగ్రెస్ మంత్రులు వ్యాఖ్యలు చేశారు. ఆ 25 మందిలో అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా ఉందంటూ వార్తలు విస్తృతమయ్యాయి. తాజాగా పార్టీ మార్పు వార్తలపై ఎమ్మెల్యే కోవా లక్ష్మి స్పందించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం బీఆర్ఎస్‌లోనే కొనసాగుతా అని అన్నారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఈ సందర్భంగా ఖండించారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ముందు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు.