- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే..?
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంటికి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వెళ్లారు. ఆదివారం సీఎంతో మర్యాదపూర్వక భేటీ అయ్యారు. అయితే అరగంట సేపు వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ప్రకాశ్ గౌడ్‌ను సీఎం సమక్షంలో సత్కరించారు. ప్రస్తుతం ఈ భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఎమ్యెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. దీంతో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు మరింత బలంగా పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది.
పొన్నం ప్రభాకర్ తో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కలిసినప్పుడు తాము మర్యాద పూర్వకంగానే కలిసినట్లు అప్పుడు వారు మీడియాకు వెల్లడించారు. రాజకీయ అంశాలు చర్చకు రాలేదని చెప్పారు. ఇప్పుడు అదే ఎమ్మెల్యే డైరెక్ట్ సీఎంను కలవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లోకి జంప్ అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఇటీవల నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. అయితే తాము మర్యాద పూర్వకంగానే కలిసినట్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చెప్పడంతో పలు అనుమానాలకు పుల్‌స్టాప్ పడింది. ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అగ్ర నాయకులు కేటీఆర్, హరీష్ రావులు విమర్శలు గుప్పిస్తుంటే.. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం సీఎంతో భేటీ అవుతున్నారు. మరి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్‌లోకి వెళ్తారా..? లేక బీఆర్ఎస్ స్పష్టం కావాల్సి ఉంది.