- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ భూమిని మున్సిపాలిటీకి అప్పగిస్తా.. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి
దిశ, చేర్యాల: కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నాడు. కన్న కూతురే ఆయనను బజారుకు లాగి ఆరోపణలు గుప్పించింది. ‘తప్పు జరిగింది.. మత్తడి భూమిని మా నాన్న అక్రమంగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేసిండ్రు. తిరిగి మున్సిపాలిటీకి అప్పగిస్తా’ అని సాక్షాత్తు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో చేర్యాల భూవివాదాంశం జిల్లాలో హాట్ టాఫిక్ గా మారింది. ఇటీవల ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పర్యటనలను అడ్డుకోవడంతోపాటు, తాజాగా ఆదివారం సదరు భూమి చుట్టూ ఉన్న ప్రహారీని కూల్చి వేసి యాదగిరి రెడ్డిపై ఆరోపణలు చేసిన ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి చేర్యాల ప్రజలు తనను ఈవిషయంలో క్షమించాలని విజ్ఞప్తి చేసింది.
చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్లు 1399, 1400, 1401, 1402 లలో 23 గంటల భూమిని 1964లో మహమ్మద్ ఫరీదుద్దీన్, బషీరుద్దీన్ లు వెలుగల లింగయ్యకు విక్రయించారు. తదనంతరం వెలుగల లింగయ్య మోటేషన్ చేసుకొని కారణంగా పహాణీల్లో మహమ్మద్ ఫరీదుద్దీన్, బషీరుద్దీన్ పేర్లు 2016 వరకు వచ్చాయి. ఇదే అదనుగా చక్రం తిప్పిన ఎమ్మెల్యే సదరు భూమిని మహమ్మద్ ఫరీదుద్దీన్, బషీరుద్దీన్ వారుసల పేరిట మ్యుటేషన్ చేయించాడు. తదనంతరం 2019 మార్చిలో తుల్జ భావానీ రెడ్డి పేరిట 1270గజాలు, మారుతీ ప్రసాద్, మరోటి పేరిట 1270 గజల భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. సదరు భూమిలో ఎమ్మెల్యే కూతురు తుల్జా భవానీ రెడ్డి ఇంటి నిర్మాణం కోసం అనుమతులు తీసుకుంది. ఇదిలా ఉంటే 2019 తుల్జా భవాని పేరిట సదరు భూమి రిజిస్ట్రేషన్ అయితే 2018 లోనే ఎలాంటి పత్రాలు లేకుండానే మున్సిపాలిటీ నుంచి ఆమె పర్మిషన్ తీసుకోవడం గమనార్హం. ఈ విషయంలో అప్పటి అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని విధులు నుంచి తొలిగించింది.
మూడేళ్లుగా కొనసాగుతున్న వివాదం
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన అనుయాయుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని తుల్జా భవానీ ఆరోపిస్తున్న సదురు 23 గుంటల భూ వివాదం హైకోర్టు, లోకాయుక్త, సిద్దిపేట సెకండ్ అడిషనల్ కోర్డులో మూడేళ్లుగా కొనసాగుతుంది. మొదటి నుంచి ఆయా కోర్టుల్లో ఎమ్మెల్యే కూతురు తుల్జా భవాని రెడ్డి కోర్టులో తన లాయర్లతో వాదనలు వినిపించడం గమనార్హం. ఏమైందో తెలియదు కానీ కొంతకాలంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఇరుకున పెట్టేలా తుల్జా భవానీ వ్యవహరిస్తోంది. ఎమ్మెల్యే పర్యటనలను అడ్డుకోవడంతోపాటు, తాజాగా ఆదివారం సదరు భూమి చుట్టూ ఉన్న ప్రహారీని కూల్చి వేసి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆరోపణలు గుప్పించిన ఎమ్మెల్యే కూతురు తుల్జా భవాని రెడ్డి ఈవిషయంలో క్షమించాలని చేర్యాల ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
వ్యూహాత్మకమా..?
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్యే కూతురు తుల్జా భవాని రెడ్డి మధ్య కొనసాగుతున్న వివాదం వ్యూహాత్మకమా..? మరేదైనా కారణమా..? అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. చేర్యాల భూవివాదంలో కోర్టులో సదరు అంశం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కూతురు తుల్జా భవాని రెడ్డి వ్యవహారంపై చేర్యాల జేఎసీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైన్పటికీ కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారిఎమ్మెల్యే ముత్తిరెడ్డి..? ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వివాదం ఏమలుపు తీసుకుంటుందో.. ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలియాలంటే వేచిచూడాల్సిందే.
చిత్తశుద్ది చాటుకోవాలి, బైరవభట్ల చక్రధారి, సుప్రీం కోర్టు న్యాయవాది
ఎమ్మెల్యే కూతురు తుల్జా భవానీ రెడ్డి చిత్తశుద్ది చాటుకోవాలి. తన పేరిట రిజిస్టేషన్ అయిన 1270 గజాల భూమిని చేర్యాల మున్సిపల్ కమిషనర్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. లేని పక్షంలో తండ్రి, కూతుర్ల మధ్య నెలకొన్న గొడవల నేపథ్యంలోనే ఈ చర్యలకు పాల్పడ్డారని భావించాల్సి వస్తుంది.