BRS MLA లాస్య నందిత మృతి.. కవిత రియాక్షన్ ఇదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2024-02-24 06:52:34.0  )
BRS MLA లాస్య నందిత మృతి.. కవిత రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (33) శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. పటాన్ చెరు ఓఆర్ఆర్ వద్ద ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఇక, ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘కంటోన్మెంట్ ఎమ్మెల్యే, సోదరి లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం‌ దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై, తండ్రి దివంగత సాయన్న బాటలో ప్రజాసేవకు అంకితమైన లాస్య నందిత అకాల మరణం అత్యంత బాధాకరం. లాస్య నందిత పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’ అని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story