‘బీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి’

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-31 10:22:24.0  )
‘బీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి’
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేతలు బుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. ఇవాళ ఆమె గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 400 రూపాయలు ఇస్తే ప్రచారానికి రావాలని అంటున్నారని, కేసీఆర్‌కు కవిత ఒక్కతే బిడ్డనా? రాష్ట్ర మహిళలు కాదా? అని ప్రశ్నించారు. కవిత 33 శాతం రిజర్వేషన్ అంటుదని, బీఆర్ఎస్‌లో ఎన్ని సీట్లు ఇచ్చారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల ప్రచారానికి మహిళలు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మహిళలను కించపరిచిన మర్రి జనార్థన్‌ను బయట తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story