- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఎస్పీఎస్పీపై మౌనం.. ‘టెన్త్’ పై గళం.. విమర్శలకు తావిస్తున్న బీఆర్ఎస్ వైఖరీ
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీక్ పై బీఆర్ఎస్ నేతలు మౌనం పాటించారు. అడపాదడపా కొందరు మాత్రమే స్పందించారు. కానీ టెన్త్ పేపర్ లీక్ విషయంలో మాత్రం కేబినెట్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు సైతం స్పందించారు. బీఆర్ఎస్ నేతల వైఖరీ విమర్శలకు తావిస్తోంది. టీఎస్పీఎస్పీకి ఒక విధంగా, టెన్త్ కు ఒక లా వ్యవహరిస్తుండటం ప్రజలతోపాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు ఆసక్తిగా, క్షణ్నంగా పరిశీలిస్తున్నారు.
మొన్న టీఎస్పీఎస్పీ.. నిన్న టెన్త్ పేపర్ల లీకేజీలు వరుస ఘటనలు ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్నాయి. ప్రజల్లో సైతం వ్యతిరేకత వస్తుంది. అంతేకాదు టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ ఘటనలో మంత్రి కేటీఆర్ పీఏ ఉన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో కేబినెట్ లోని ముగ్గురు నలుగురు మాత్రమే స్పందించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఎవరూ అంతగా రియాక్ట్ కాలేదు. స్పందించినవారు సైతం ప్రతిపక్షాలు మేలుకోకముందే నిందితులను ప్రభుత్వం అరెస్టు చేసిందని, విచారణకు సిట్ వేసిందని పేర్కొన్నారు.
కానీ టెన్త్ పేపర్ లీక్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాత్ర ఉందనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేయడంతో బీఆర్ఎస్ నేతలంతా స్పందించారు. కేబినెట్ లోని 11మంది మంత్రులు, సగంమంది ఎమ్మె్ల్యేలతోపాటు ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు సైతం స్పందించారు. మీడియా ముందు బండి పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలని, పీడియాక్టులు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల నిరసనలు చేపట్టారు. ఆ నిరసనలో మంత్రులు సైతం పాల్గొన్నారు.
దీంతో ప్రజల నుంచి విమర్శలు గుప్పిస్తున్నారు. టీఎస్పీఎసీ పేపర్ లీక్ అయితే స్పందించని వారు... బీజేపీ నేత బండి ప్రమేయం ఉందనగానే స్పందిచడం రాజకీయమేనని అభిప్రాయపడుతున్నారు. వారు చేస్తే తప్పుకాదుగానీ... ఇతరులు చేస్తేనే తప్పా అని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు వస్తే ఎందుకు అరెస్టు చేసి విచారణ చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
రాబోయే ఎన్నికల కోసమే..?
బీజేపీ నిత్యం ప్రజల్లో ఉండేందుకు విస్తృత కార్యక్రమాలు చేపడుతుంది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహిస్తుంది. ఇప్పటికే రుణమాపీ కాకపోవడంతో రైతులు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ఇవ్వడంలో జాప్యం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ చేయకపోవడం, ఉద్యోగుల పీఆర్సీ ఇతర కారణాలు, పింఛన్లలో జాప్యంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది. మరోవైపు టీఎస్పీఎసీ పేపర్ లీకేజీ తో నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత స్టార్ట్ అయింది. మరోవైపు కేడర్ నేతలకు మధ్య గ్యాప్ ఉండటంతో దానిని తగ్గించేందుకు ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తుంది. ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో పార్టీకి గడ్డుకాలం ఏర్పడింది.
అయితే టెన్త్ పేపర్ లీక్ లో బండిసంజయ్ పై ఆరోపణలు రాకవడంతో బీజేపీపై బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కట్టడికి చర్యలు చేపట్టింది. దీనిని ఆస్త్రంగా తీసుకొని బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టాలని భావిస్తుంది, అందులో బాగంగానే బండిపై ఒకవైపు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోవైపు పోరుబాటపడుతుంది. ఎప్పుడు లేని విధంగా టెన్త్ పేపర్ పై బీఆర్ఎస్ నేతలంతా స్పందించారు. ఒక్కసారి పార్టీ నేతలంతా యాక్టీవ్ అయ్యారు. రాబోయే ఎన్నికలకు టెన్త్ పేపర్ లీక్ కుట్రను వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రజల్లో సానుభూతి పొందాలనే యత్నాలను షురూ చేసినట్లు స్పష్టమవుతోంది.
Read more: