క్షమాపణ చెప్పాల్సిందే.. బండి సంజయ్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్

by GSrikanth |   ( Updated:2023-03-11 14:05:15.0  )
క్షమాపణ చెప్పాల్సిందే.. బండి సంజయ్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆమెకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీ, హైదరాబాద్‌లో బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు పలు చోట్ల దిష్టి బొమ్మలు దహనం చేశారు. వెంటనే సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని.. కవితకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ నిరసనల్లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. వెంటనే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

‘కవితని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా’ అంటూ బండి సంజయ్ కామెంట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత వికెట్ పడిపోయిందని.. అతి త్వరలో బీఆర్ఎస్‌లో మరికొంతమంది క్లీన్ బౌల్డ్ అవుతారని అన్నారు. అయితే, బండి వ్యాఖ్యలకు వెంటనే స్పందించకుండా కవిత విచారణకు హాజరైన అనంతరం బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కవిత విచారణ అనంతరం ఆమెను అరెస్టు చేస్తారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఆ ఇష్యూని డైవర్ట్ చేసేందుకే బీఆర్ఎస్ ఆందోళనలకు దిగిందని సోషల్‌ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కవిత పేరు డ్యామేజ్ కాకుండా, ప్రజల దృష్టి మరల్చేందుకే బండి సంజయ్‌పై నిరసనలకు బీఆర్ఎస్ ప్లాన్ చేసిందని ట్వీట్ చేస్తున్నారు. కాగా, కవిత అరెస్టైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది.

Also Read..

కవిత సమాధానం చెప్పి తీరాల్సిందే: తరుణ్ చుగ్

Advertisement

Next Story