- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Game Changer: ‘బొమ్మ’ బ్లాక్ బస్టర్.. చెర్రీ సరికొత్త రికార్డు
దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు శంకర్ ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించిన చిత్రం. తెలుగు నిర్మాత దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఇది. దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా లెవల్‌లో ఈ ‘గేమ్ ఛేంజర్’ థియేటర్స్‌లోకి రాబోతున్నారు.
కథాంశం ప్లస్
అయితే ఈ సినిమాలోని కథాంశం ప్లస్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై హైప్‌ను పెంచేసింది. శంకర్ మార్కు విజువల్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమన్ బీజియమ్స్ అదరగొట్టాయి. చరణ్ హీరోయిజం మరింత పెంచినట్లుగా ట్రైలర్ ఉంది. ఇక రామ్ చరణ్ పిక్స్, ఫొటోలు అదరగొట్టాయి. లుంగీ, బనియన్‌పై ఉన్న చెర్రీ పోస్టర్, కటౌట్స్ ప్రపంచవ్యాప్తంగా హల్ చల్ చేశాయి.
సోషల్ మీడియాలో ట్రెండీ లుక్‌గా నిలిచిపోయింది. విజయవాడలో ఏర్పాటు చేసిన రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్ దేశంలోనే అత్యంత పెద్దదిగా నిలిచిపోయింది. దీంతో ఈ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ కటౌట్‌కు పూలాభిషేకం చేశారు. ఫ్యాన్స్ సొంత ఖర్చుతో దీన్ని వారం పాటు కష్టపడి ఏర్పాటు చేశారు. 50 మందితో కూడిన చెన్నైకు చెందిన టీమ్.. ఈ భారీ కటౌట్‌ను నిర్మించింది. రామ్ చరణ్ మాస్ లుక్, లుంగీ, బనియన్‌తో ఉన్న ఈ కటౌట్ చూపరులను కట్టి పారేశింది.
సోలోగా గేమ్ ఛేంజర్
మరోవైపు త్రిబుల్‌ఆర్‌తో చెర్రీ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయారు. ఆ మూవీ తర్వాత సోలోగా గేమ్ ఛేంజర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ మూవలో రాజకీయ నాయకుడిగనే కాకుండా కలెక్టర్‌గానే కనిపించినట్లు ట్రైలర్‌లో చూపించారు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు వావ్ అనిపించాయి. హీరో రామ్ చరణ్, ఎస్ జే సూర్య మధ్య తెరకెక్కించిన సన్నివేశాలు మరో స్థాయిలో ఉన్నట్లు కనిపించాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఈ మూవీ టచ్ చేసినట్లుగా సీన్స్ చిత్రీకరించారు. సోషియో, పొలిటికల్, మాస్ ఎంటర్ ట్రైనర్‌గా గేమ్ ఛేంజర్ రాబోతున్నట్లుగా అనిపిస్తోంది.
తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇంతటి అంచనాలతో సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
బుకింగ్స్ ఫుల్
అయితే ఈ మూవీకి ఏపీలో గుడ్ న్యూస్ లభించింది. సినిమా విడుదల తర్వాత 9 రోజుల పాటు టికెట్స్ రేట్స్ పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కొనసాగుతున్నాయి. వేలల్లో టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇప్పటికే రూ.7 కోట్లకు పైగా ప్రీ-బుకింగ్స్ వచ్చినట్లు చిత్ర బృందం వెల్లడించింది. యూఎస్ మార్కెట్ లో సెన్సేషనల్ బుకింగ్స్ కనిపిస్తున్నట్లు తెలిపింది. ముందుగా అనుకున్న దానికంటు మరిన్ని షోస్ పెంచుతున్నట్లు ప్రకటించింది. దాదాపు రూ.450 కోట్లతో తెరకెక్కిన ఈ గేమ్ ఛేంజర్ గత రికార్డులను బద్ధలు కొడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్పా-2’ మూవీ దేశంలో రికార్డులు సృష్టించడంతో ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్‌ను ముందుగానే ఈ మూవీ ప్రారంభించబోతోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో గేమ్ ఛేంజర్ సందడి మొదలైంది. పండగకు ముందే హౌస్ పుల్స్ అవుతున్నాయి. జనం సొంతూళ్లకు వెళ్తున్నారు. అయితే ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట ఒక్కటే, ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఎలా ఉండబోతోందని. ఇప్పటికే గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూసిన ప్రేక్షకులను సినిమా ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.