ఆటో నుంచి జారి పడి విద్యార్థిని దుర్మరణం

by Jakkula Mamatha |
ఆటో నుంచి జారి పడి విద్యార్థిని దుర్మరణం
X

దిశ,వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ(Sankranti festival) సందర్భంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పండుగకి హాస్టల్ విద్యార్థులు ఇంటికి వెళ్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎస్.రాయవరం మండలం లోని ప్రభుత్వ పాఠశాలలో(Government School) చదువుతున్న పదో తరగతి విద్యార్థిని పాముల యోగిత(15) మృతి చెందింది. సంక్రాంతికి సెలవులు ఇవ్వడం తో స్నేహితులతో కలిసి ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సోముదేవుపల్లి వద్దకు రాగానే మలుపు వద్ద ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి జారి పడి విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

Advertisement

Next Story