Rakesh Reddy: సీఎం రేవంత్ రెడ్డికి విజన్ లేదు

by Gantepaka Srikanth |
Rakesh Reddy: సీఎం రేవంత్ రెడ్డికి విజన్ లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి దుయ్యబట్టారు. పది నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోనే రాష్ట్రం ఆర్థికంగా కుదేలైందన్నారు. రియల్ ఎస్టేట్ పూర్తిగా కుంటుబడిందని, హైడ్రా భయంతో రిజిస్ట్రేషన్ లు, పెట్టుబడులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసి సుందరీకరణ ఒక డ్రామా, కేవలం ధనార్జన కోసమే తెస్తున్న ప్రాజెక్ట్ అదని మండిపడ్డారు. మూసిలో పారేది నీళ్లు కాదు, ప్రజల కన్నీళ్లు, రక్తం అన్నారు. ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తుందని, మరికొద్ది రోజులు వెళ్తే రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రేవంత్ రెడ్డికి సొంతంగా విజన్ లేదుఅని, ఎవరు ఏది చెప్తే అదే చేస్తూ రాష్ట్రాన్ని సంక్షోభం లోకి నెడుతున్నారన్నారు.

ప్రజల ఆదాయం తగ్గుతుంది... రేవంత్ రెడ్డి అతడి సోదరుల ఆదాయం పెరుగుతుందన్నారు. ఒక్కో గాజానికి 40 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని, ఇది బహిరంగ రహస్యం.. రాష్ట్రంలో అందరికీ తెలుసు అని ఆరోపించారు. సంపూర్ణ రుణమాఫీ అయిందని రేవంత్ రెడ్డి ఇన్నాళ్లు చెప్పిన మాటలు అబద్ధమని తానే స్వయంగా ప్రధానికి రాసిన లేఖలో 18 వేల కోట్లు మంజూరు చేశామని బయట పెట్టారన్నారు. హరీష్ రావు, కేటీఆర్ చెప్పిందే నిజమైందని, ఇన్నాళ్లు అబద్ధాలు అడి ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాస్తాడా అని డిమాండ్ చేశారు. బిల్డర్లు కట్టిన ఇల్లు సంవత్సర కాలం నుండి అమ్ముడుపోక అప్పుల పాలవుతున్నారన్నారు. కేవలం రియల్ ఎస్టేట్ రంగం కాకుండా, టెక్స్ టైల్ రంగం, హాస్పిటల్ లు, హోటల్లు, రెస్టారెంట్ లు, టూరిజం అన్ని కుదేలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మార్కెట్లో మని సర్క్యులేషన్ లేక, రొటేషన్ లేక అక్కడి డబ్బులు అక్కడ ఆగిపోయని, దాని ఫలితంగా 9 నెలల నుండి గ్రామ పంచాయితీ సిబ్బందికి జీతాలువ్వలేదన్నారు. పారిశుధ్యం పడకేసిందన్నారు. గ్రామాలు మురికి కూపాలుగా మారాయని, గ్రామ పంచాయతీలో చెత్త సేకరించి ట్రాక్టర్లకు డీజిల్ పోయడానిక్, బ్లీచింగ్ పౌడర్ కు, పండగ పూట వీధి లైట్లు వేయడానికి కూడా డబ్బులు లేని దుస్థితి దాపురించిందన్నారు. 2వేల కోట్లు ఇప్పటివరకు గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సి ఉండే కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఉపాధి హామీ పథకం నుంచి 1500 కోట్ల బకాయి పడ్డ ప్రభుత్వం ఇప్పటికీ నయా పైసా ఇవ్వలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ లో, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాలు చెల్లించలేదన్నారు. ప్రభుత్వం జూనియర్ కాలేజీలో, డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతలు చెల్లించలేదని, పైగా 5 డీఏలు పెండింగ్ లో ఉన్నాయని, పీఆర్సీ జాడ లేదన్నారు.

ప్రభుత్వానికి ఈ 9 నెలల్లో ప్రభుత్వానికి 87 వేల కోట్ల ఆదాయం రావల్సి ఉందని, కానీ, కేవలం 73 కోట్లు మాత్రమే వచ్చాయంటే 13 వేల కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని, నెలకు 1500 నుండి 2000 కోట్ల ఆదాయం ఆవిరైందని ఆరోపించారు. ప్రభుత్వం అభివృద్ధి కోసం 32000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 8000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కేన్స్ సంస్థ కాంగ్రెస్ నిర్వాకంతోగుజరాత్ కు తరలిపోయిందని, అమర్ రాజా సంస్థ వెళ్ళడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే మేలుకొని హైడ్రాను నిలిపివేయాలని, మూసి సుందరీకరణ పై అఖిల పక్షం ఏర్పాటు చేసిన తర్వాతే ముందుకు వెళ్ళాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story